ప్రమాద భవనాన్ని సీజ్ చేసిన GHMC అధికారులు
HYD: టోలిచౌకిలో భవనంపై నుంచి పడి ముగ్గురు కార్మికులు మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో GHMC అధికారులు రంగంలోకి దిగారు. సదరు బిల్డింగ్‌ను సీజ్ చేశారు. G+2 అనుమతితో ఐదు అంతస్థుల నిర్మాణం చేపట్టినట్లు గుర్తించిన అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు.