వ్యవసాయ మార్కెట్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

MHBD: వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఇస్లావత్ సుధాకర్ నాయక్ జాతీయ జెండా ఆవిష్కరించారు. మహాత్మా గాంధీ, అంబేద్కర్, పలువురు స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.