వరంగల్ మార్కెట్లో సరుకుల ధరలు ఇలా..!

వరంగల్ మార్కెట్లో సరుకుల ధరలు ఇలా..!

వరంగల్ పట్టణ కేంద్రంలోని ఎనుమాముల మార్కెట్ 3 రోజుల విరామం అనంతరం సోమవారం ప్రారంభం కాగా, సరుకుల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా పత్తి ధర రూ.8,100 పలికింది. అలాగే 341 రకం మిర్చి క్వింటాకు రూ.20,200 ధర పలకగా.. వండర్ హాట్(WH) మిర్చి రూ.30,600 పలికింది. తేజ మిర్చి ధర రూ.21,100, ఎల్లో మిర్చి రూ.21,000 పలికాయి. మార్కెట్లో కొనుగోళ్లు జోరుగా కొనసాగుతున్నాయి.