మున్సిపల్ కార్యాలయంలో న్యాయ విజ్ఞాన సదస్సు

ELR: నూజివీడు మున్సిపల్ కార్యాలయంలో కార్మిక దినోత్సవ వారోత్సవాల సందర్భంగా మంగళవారం న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ అనూష మాట్లాడుతూ.. కార్మికులు హక్కులు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్న న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు అన్నారు. పేదలకు ప్రభుత్వమే న్యాయవాదిని నియమిస్తుందని స్పష్టం చేశారు.