నేడు మెగా జాబ్ మేళా

SKLM: నరసన్నపేటలో మంగళవారం రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళాను నరసన్నపేట పద్మావతి కళాశాలలో నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి సాయికుమార్ తెలిపారు. ఈ మేళాలో పలు ప్రైవేటు కంపెనీలు పాల్గొని 500 ఉద్యోగాలు నియమించనున్నారు. 18-30 ఏళ్లు ఉండి 10,12, డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి.