తమలపాకుతో మోముకు తాజాదనం

తమలపాకుతో మోముకు తాజాదనం

అందంగా కనిపించేందుకు అమ్మాయిలు రసాయన ఉత్పత్తులు వాడటం కంటే సహజసిద్ధంగా దొరికే తమలపాకు వాడటం మంచిదని సౌందర్య నిపుణులు అంటున్నారు. తమలపాకును మెత్తగా నూరి పసుపు, తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇలా చేస్తే మొటిమలు తగ్గి, చర్మం మృదువుగా మారుతుంది. తమలపాకులు మరిగించిన నీటిలో తేనె, నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుంటే తాజాగా కనిపిస్తుంది.