మొబైల్ ఎక్స్‌రే మిషన్ ప్రారంభోత్సవం

NLG: అసోసియేషన్ వారు బహుకరించిన మొబైల్ ఎక్స్‌రే మిషన్ ను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ గురువారం ప్రారంభించారు. ఈ మొబైల్ ఎక్స్‌రే ఏఐ టెక్నాలజీతో పనిచేస్తుందని వారు తెలిపారు. బాదలాపురం రైస్ మిల్లులో పనిచేస్తున్న 30 మంది కార్మికులకు ఎక్స్ రే తీసి వెంటనే రిపోర్టులను అందించారు. అసోసియేషన్ సభ్యులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.