బాధితులకు పోగొట్టుకున్న సెల్ ఫోన్లు అందజేసిన సీఐ

బాధితులకు పోగొట్టుకున్న సెల్ ఫోన్లు అందజేసిన సీఐ

కోనసీమ: ఆత్రేయపురం, ఆలమూరు మండలాలలో పోగొట్టుకున్న 7 సెల్‌ఫోన్లను రావులపాలెం రూరల్ సీఐ విద్యాసాగర్ సిబ్బంది సహాయంతో రికవరీ చేసి యజమానులకు అప్పగించారు. సెల్‌ఫోన్ పోగొట్టుకున్న వారు సంబంధిత పోలీస్ స్టేషన్‌కు లేదా CEIR పోర్టల్‌లో నేరుగా ఫిర్యాదు నమోదు చేస్తే ట్రేస్ చేస్తామని సీఐ తెలిపారు. రికవరీలో కీలక పాత్ర పోషించిన ఏఎస్ఐ డి.ఎస్. స్వామిని సీఐ అభినందించారు.