' ప్రభుత్వం నిర్దేశించిన మెనూ కచ్చితంగా పాటించాలి'

KNR: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం నిర్దేశించిన మెనూ కచ్చితంగా పాటిస్తూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. మంగళవారం చింతకుంట పరిధి శాంతినగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. తరగతి గదులు తిరుగుతూ విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, మధ్యాహ్నం భోజనం, బోధన మెటీరియల్, రీడింగ్ కార్నర్‌ను పరిశీలించారు.