అన్నదాత సుఖీభవకు నేడే చివరి తేది

NLR: కోవూరు మండల వ్యవసాయాధికారిణి టి.రజని మంగళవారం చెర్లోపాలెం, పడుగుపాడు గ్రామాల్లో రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అన్నదాత సుఖీభవకు సంబంధించిన ఫిర్యాదులు ఉంటే ఈ నెల 20వ తేదీ లోపల గ్రామ వ్యవసాయ అధికారులను సంప్రదించి ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.