పేకాట శిబిరంపై దాడి.. ఐదుగురు అరెస్ట్
కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలంలోని మర్కల్ గ్రామ పరిసరాల్లో అక్రమ జూదం జరుగుతోందన్న విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు ఇవాళ దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై పుష్పరాజ్ పేర్కొన్నారు. వారి వద్ద నుంచి రూ. 13,910ల నగదు, నాలుగు మోటార్ సైకిళ్లు, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.