నేటి నుంచి 136 జీపీలకు నామినేషన్లు
SRD: జిల్లాలో మొదటి దశలో ఏడు మండలాల్లోని 136 గ్రామపంచాయతీలో ఈరోజు 27 నుంచి 30వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారని కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. నామినేషన్ల స్వీకరణ కోసం 43 మంది చొప్పున రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులను నియమించినట్లు చెప్పారు. నామినేషన్ల స్వీకరణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.