'రెండు మండలాలను రాయచోటి రెవెన్యూ డివిజన్‌లోకి చేర్చాలి'
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్‌కు జనసేన సీనియర్ నాయకుడు రామా శ్రీనివాస్ శనివారం వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం రాజంపేట రెవెన్యూ డివిజన్‌లో ఉన్న టి. సుండుపల్లి, వీరబల్లి మండలాలను రాయచోటి డివిజన్‌లోకి మార్చాలని ఆయన కోరారు. ఈ మండలాల ప్రజలు ఆర్డీవో కార్యాలయానికి 50-60 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోందన్నారు.