సీఐఐ సదస్సుకు విశాఖ ముస్తాబవుతోంది: లోకేష్

సీఐఐ సదస్సుకు విశాఖ ముస్తాబవుతోంది: లోకేష్

AP: ఈనెల 14, 15 తేదీల్లో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు 'సిటీ ఆఫ్ డెస్టినీ' విశాఖపట్నం ముస్తాబవుతోందని మంత్రి లోకేష్ తెలిపారు. రహదారుల అభివృద్ధి, తీరప్రాంత సుందరీకరణ, కొత్త ల్యాండ్‌స్కేప్ పనులు అన్నీ వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించడానికి, చిరస్థాయి ముద్ర వేయడానికి సిద్ధంగా ఉన్నామని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.