VIDEO: కోటిలింగేశ్వర ఆలయంలో అయ్యప్పకు అభిషేకాలు
WNP: కొత్తకోట మండలం కానాయిపల్లిలోని సుప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీ కోటిలింగేశ్వరదత్త ఆలయంలో శనివారం కార్తీక ఉత్తరనక్షత్ర పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులు అర్చకుల ఆధ్వర్యంలో హరిహర సుతుడు అయ్యప్పస్వామికి పంచామృతాలు, భస్మగంధ కుంకుమ జలాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ధూప దీప నైవేద్యాలతో మహా మంగళహారతి సమర్పించారు.