ధర్వేశిపురం ఎల్లమ్మకు మంగళవారం ప్రత్యేక పూజలు
NLG: కనగల్ ధర్వేశిపురం శ్రీ ఎల్లమ్మ ఆలయంలో కార్తీక మంగళవారం పూజలు జరిగాయి. తెల్లవారుజామునుంచే భక్తులు భారీగా వచ్చి అమ్మవారిని దర్శించారు. పూజారి మల్లాచారి పంచామృతాభిషేకాలు, కుంకుమ పూజలు, మంగళహారతులు నిర్వహించారు. భజనలతో భక్తి వాతావరణం నెలకొగా, చివర్లో తీర్థప్రసాదాలు అందించారు.