గురుకులంలో ఎలుక‌లు బెడ‌ద‌

గురుకులంలో ఎలుక‌లు బెడ‌ద‌

VSP: అడివివరం బీసీ గురుకుల హాస్టల్‌లో ఎలుకల కలకలం నెలకొంది. డార్మిటరీలో నిద్రపోతున్న విద్యార్థులను ఎలుకలు కరుస్తుండటంతో గత నెలలోనే 10 మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారు. రాత్రివేళల్లో ఎలుకల మధ్యే నిద్రపోవాల్సి వస్తోందని విద్యార్థులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.