సోమేశ్వర స్వామి ఆలయానికి వంట పాత్రల వితరణ
సత్యసాయి: కొత్తచెరువులోని పురాతన సోమేశ్వర స్వామి ఆలయానికి గ్రీన్ భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వంట సామాగ్రిని పంపిణీ చేశారు. భక్తుల కోరిక మేరకు ప్రసాదాల తయారీ, శుభకార్యాల కోసం అవసరమైన పాత్రలు, బకెట్లు, జగ్గులను టీడీపీ నాయకులు సామకోటి ఆదినారాయణ అందజేశారు. సత్యసాయి బాబా ఆశీస్సులతో ఈ సేవా కార్యక్రమం చేపట్టడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.