తల్లిపాలను కూడా వైసీపీ కల్తీ చేస్తుంది: మంత్రి
ప్రకాశం: చుక్కపాలు లేకుండా కల్తీ నెయ్యి సృష్టించిన వైసీపీ నేతలు తల్లిపాలను కూడా కల్తీచేయగల ఘనులని మంత్రి స్వామి ఓ ప్రకటనలో ఆరోపించారు. తప్పులు చేసి ఎదుటి వారిపై రుద్దటం వైసీపీ నైజమని పేర్కొన్నారు. రసాయనాలతో తయారైన పదార్థాలతోనే నెయ్యి సృష్టించారని స్పష్టంగా తేలినా సిగ్గులేకుండా బుకాయిస్తున్నారన్నారు. శ్రీవారి పవిత్రతను వైసీపీ అపహాస్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.