పెద్దపులి సంచారం.. భయాందోళనలో ప్రజలు
AP: పోలవరం జిల్లా నేలకోట శ్రీరామదుర్గం కొండ వద్ద పెద్దపులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు కొండపై ఉన్న భక్తులను సురక్షితంగా కిందకు తరలించారు. డిఎఫ్ఓ శివకుమార్ నేతృత్వంలో పులి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. పరిసర గ్రామాల ప్రజలు అడవి వైపు వెళ్లవద్దని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.