తణుకులో ప్రత్యేక పూజలు చేసిన దర్శకుడు
W.G: తణుకు పట్టణంలో వేంచేసిన పార్వతీ సమేత కపర్దేశ్వర స్వామిని ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ శుక్రవారం దర్శించుకున్నారు. పాతఊరు మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఇటీవల పునర్నిర్మించిన ఈ ఆలయంలో కార్తీకమాసం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం తణుకు విచ్చేసిన ఆయన స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.