ఎస్పీ కార్యాలయంలో జగ్జీవన్ జయంతి వేడుకలు
VKB: బడుగు బలహీనవర్గాల అభివృద్ధికి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఎనలేని కృషి చేశారని వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా పేర్కొన్నారు. ఆదివారం ఎస్పీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సమాజంలో అందరికీ సమానత్వం, పేదల అభ్యున్నతే లక్ష్యంగా ఆయన పనిచేశారని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని ఎస్పీ తెలిపారు.