'ఈ నెల 15న జరిగే సభను విజయవంతం చేయాలి'

SRCL: ఈ నెల 15న కామారెడ్డిలో త్వరలో జరగబోయే బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభను విజయవంతం చేయాలని కోనరావుపేట మండల కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. గురువారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, హాజరుకానున్నట్లు కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు.