'మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకించాలి'
W.G: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రజలంతా వ్యతిరేకించాలని దళిత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గంటా సుందర్ కుమార్ కోరారు. ఈనెల 12న జిల్లాలో వైసీపీ తలపెట్టిన నిరసన ర్యాలీని జయప్రదం చేయాలని భీమవరంలో సోమవారం ఆయన పిలుపునిచ్చారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం అవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.