యువతిని కాపాడిన 'శక్తి టీం'
GNTR: ఆటో ఎక్కిన యువతితో డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన మంగళగిరి మండలం చినకాకానిలో జరిగింది. ఆమె 'శక్తి యాప్' ద్వారా ఫిర్యాదు చేయగా, పోలీసులు స్పందించారు. యువతిపై అత్యాచారానికి యత్నిస్తుండగా అక్కడికి చేరుకుని కాపాడారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని యువతిని స్వస్థలానికి చేర్చినట్లు తెలిపారు.