మెక్సికోలో హింస.. పోలీసులపై Gen-Z దాడి

మెక్సికోలో హింస.. పోలీసులపై Gen-Z దాడి

మెక్సికోలో అవినీతికి వ్యతిరేకంగా Gen-Z యువత చేపట్టిన ఆందోళన హింసకు దారితీసింది. మెక్సికో దేశాధ్యక్షురాలు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ యువత అధ్యక్ష భవనంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని అడ్డుకున్న పోలీసులపై జెన్-జీ గ్రూప్ దాడికి పాల్పడింది. ఈ దాడిలో 100 మందికిపైగా పోలీసులు గాయపడ్డారు. దీంతో దేశంలో శాంతిభద్రతల పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది.