ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆవేదన వ్యక్తం దళితులు

BDK: ఇందిరమ్మ ఇండ్లు వస్తాయని ఎంతో ఎదురు చూసిన నిరాశే ఎదురైందని సొప్పాల గ్రామం దళితులు ఆవేదన వ్యక్తం చేశారు. షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి కారకగూడెం మండల కన్వీనర్ కీసరి దుర్గారావు సొప్పాల గ్రామపంచాయతీ గ్రామంలో దళితులు ఎదుర్కొంటున్న ఇండ్ల సమస్యను సోమవారం మీడియాకు వెల్లడించారు. నిరుపేద దళితులు ఇందిరమ్మ ఇండ్ల కోసం వెయ్యి కండ్లతో ఎదురు చూశారని తెలిపారు.