'అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి'

'అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి'

AKP: అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఎలమంచిలి అగ్నిమాపక శాఖ అధికారి రాంబాబు సూచించారు. అగ్నిమాపక వారోత్సవాలు సందర్భంగా ఎలమంచిలి ప్రభుత్వాసుపత్రిలో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదాలు జరిగితే వెంటనే తీసుకోవలసిన చర్యలను వివరించారు. అలాగే, అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.