VIDEO: మద్యం షాపు లక్కీ డ్రా వద్ద పరిస్థితి ఇది..!
WGL: జిల్లా ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని 57మద్యం షాపులకు లాటరీ ద్వారా నేడు లక్కీ డ్రా తీయనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నగరంలోని నాని గార్డెన్స్ వద్ద సందడి నెలకొంది. కలెక్టర్ సత్యశారదా దేవి లక్కీ డ్రా తీయనుండగా ఎటువంటి ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు చేపట్టారు. 2025-27సం.కి గాను జిల్లాలోని 57మద్యం షాపులకు 1958 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు.