అకాల వర్షాలు.. అన్నదాత కన్నీరు

SDPT: జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. హుస్నాబాద్‌లో మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. వర్షానికి మార్కెట్ యార్డులో రైతులు ఆరబోసిన వరి ధాన్యం కొట్టుకుపోయింది. వరద నీటిలో కొట్టుకుపోతున్న ధాన్యాన్ని చూస్తూ రైతులు ఆందోళనకు గురయ్యారు.