ఉమా రుద్ర కోటీశ్వర ఆలయ హుండీ లెక్కింపు
SKLM: శ్రీకాకుళం శ్రీ ఉమారుద్ర కోటేశ్వర ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టామని దేవాదాయ శాఖ ఈవో సుకన్య తెలిపారు. బుధవారం ఆలయ ప్రాంగణంలో ప్రధాన అర్చకులు శ్రీరామ్ మూర్తి, పాలకమండలి అధ్యక్షుడు దేవేంద్ర నాయుడు సమక్షంలో హుండీ తెరవడం జరిగిందన్నారు. గత 42 రోజులకు వచ్చిన ఆదాయాన్ని లెక్కించగా రూ.2.64 లక్షలు వచ్చిందన్నారు.