సర్పంచి అభ్యర్థి.. బాండ్ పేపర్
KMR: పెద్ద కొడప్గల్ మండలంలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. వివిధ పార్టీల నుంచే కాకుండా స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ వేయడానికి సిద్ధమవుతున్నారు. మండలంలోని పోచారం తండాకు చెందిన పవార్ సుమిత్ర వినూత్న ప్రచారం చేస్తున్నారు. పేదల కోసం సర్పంచిగా పని చేస్తానని, ప్రస్తుతం తన ఆస్తులకు మించి అక్రమ ఆస్తులు సంపాదించనని బాండ్ పేపర్‌పై రాసి ప్రచారం చేస్తున్నారు.