అందాల పోటీలపై VHP తీవ్ర విమర్శలు

TG: హైదరాబాద్‌లో అందాల పోటీల నిర్వహణపై విశ్వహిందూ పరిషత్ తీవ్ర విమర్శలు చేసింది. అందాల లోయలో ఉగ్రవాదులు పేట్రేగిపోతుంటే.. ఇక్కడ అందాల పోటీలు ఎలా నిర్వహిస్తారంటూ ప్రశ్నించింది. పాకిస్తాన్ సహా కొన్నిదేశాల భామల రాకపై VHP అభ్యంతరం వ్యక్తం చేసింది. పాకిస్తాన్ మద్దతిచ్చే బంగ్లాదేశ్, మయన్మార్, టర్కీ ప్రతినిధులూ హాజరవుతున్నారంటూ మండిపడ్డారు.