నూతన పాఠశాల భవనం నిర్మించాలని కలెక్టర్‌కు వినతి

నూతన పాఠశాల భవనం నిర్మించాలని కలెక్టర్‌కు వినతి

నారయణపేట మండలం అభంగాపూర్లో శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనం తొలగించి కొత్తగా నిర్మించాలని శుక్రవారం PYL నేతలు కలెక్టర్ సిక్తా పట్నాయక్‌కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి రాము మాట్లాడుతూ.. 120 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలో ఏడుగురు ఉండాల్సిన చోట కేవలం ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారని, పూర్తి స్థాయిలో ఖాళీలు భర్తీ చేయాలని కోరారు.