సుంకేసులకు భారీ వరద.. 21 గేట్లు ఓపెన్

GWDL: కర్ణాటకలోని తుంగభద్రా డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయడంతో రాజోలి సమీపంలోని సుంకేసుల బ్యారేజీకి భారీగా వరద వస్తోంది. ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 1,25,000 క్యూసెక్కులుగా ఉంది. బ్యారేజీలో 0.688 టీఎంసీల నీటిని నిల్వ ఉంచారు. 21 గేట్లు ఎత్తి 1,22,326, కేసీ కెనాల్‌కు 1,847 మొత్తం 1,24,173 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.