'యువత మత్తుకు బానిస కావొద్దు'

'యువత మత్తుకు బానిస కావొద్దు'

చిత్తూరు గిరింపేట మునిసిపల్ హై స్కూల్‌లో సైబర్ నేరాలు, రోడ్డు భద్రత, మహిళా నేరాలపై క్రైమ్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఉమామహేశ్వరరావు బుధవారం అవగాహన కల్పించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని తెలిపారు. సైబర్ నేరాలు అధికమయ్యాయని, అపరిచిత వ్యక్తులకు ఓటీపీలు, ఆధార్ నెంబర్లు తెలపరాదని చెప్పారు. మహిళల భద్రతకు శక్తి యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.