వనపర్తిలో ఎండల తీవ్రత పెరుగుతోంది
వనపర్తి జిల్లాలో గడిచిన 24 గంటల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యాయి. దగడలో అత్యధికంగా 39.5°C నమోదైంది. రేమద్దుల, వీపనగండ్లలో 39.4°C, రేవల్లి, వెలిగొండ, ఆత్మకూరు ప్రాంతాల్లో 39.3°C నమోదయ్యాయి. వనపర్తి, శ్రీరంగాపూర్‌లో 38.7°C, పలు ప్రాంతాల్లో 38°కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు ఎండల తీవ్రతను అనుభవిస్తున్నారు.