'వీఆర్ఏలకు నైట్ డ్యూటీలు వెయ్యద్దు'

ప్రకాశం: కనిగిరి మండల వీఆర్ఏ సంఘం జనరల్ బాడీ సమావేశం శుక్రవారం స్థానిక సీఐటీయూ ఆలయంలో జరిగింది. వీఆర్ఏల సంఘం గౌరవ అధ్యక్షులు పీసీ కేశవరావు మాట్లాడుతూ.. వీఆర్ఏలకు నైట్ డ్యూటీలు వేయవద్దు అని, పే స్కేల్ ద్వారా జీతాలు చెల్లించాలని, డిఎను జీతంలో కలపాలని తెలిపారు. వీఆర్ఏల సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఉద్యమంలో వీఆర్ఏలు పోరాటాలకు సిద్ధం కావాలని అయన అన్నారు.