సారా తయారీ స్థావరాలపై ఎక్సైజ్ అధికారుల దాడులు

ELR: చాట్రాయి మండలం చిన్నంపేట గ్రామంలో సారా స్థావరాలపై శుక్రవారం దాడులు చేసినట్లు ప్రొహిబిషన్, ఎక్సైజ్ CI ఏ మస్తానయ్య తెలిపారు. 50 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం చేసి 2 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పరస నాగేశ్వర రావుపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సారా తయారీ క్రయవిక్రయాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.