హత్య కేసులో ముగ్గురికి జీవిత ఖైదు
SRCL: అదనపు వరకట్నం కోసం హేమలత అనే మహిళను హత్య చేసిన కేసులో భర్త సింగారపు జనార్ధన్‌తో పాటు మరో ఇద్దరికి (మేనల్లుడు సాగర్, సోదరుడి కుమారుడు జనార్ధన్) సిరిసిల్ల ప్రధాన న్యాయమూర్తి నీరజ జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు. 2018 ఏప్రిల్ 3న రుద్రంగిలో జరిగిన ఈ ఘోర ఘటనపై విచారణ అనంతరం నిందితులకు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ. 2,000 జరిమానా విధించినట్లు ఎస్పీ తెలిపారు.