ఎరువుల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు

ఎరువుల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు

MDK: మైదుకూరు వ్యవసాయ సంచాలకులు కృష్ణమూర్తి, స్థానిక అధికారి బాలగంగాధర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. యూరియా విక్రయాలు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు మాత్రమే ఇవ్వాలని, రైతులకు తప్పనిసరిగా రసీదులు ఇవ్వాలని సూచించారు. అవకతవకలకు పాల్పడితే FCO-1985 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.