జిల్లాలో నకిలీ ఐఏఎస్
NZB: కామరెడ్డి కలెక్టరేట్‌లో ఓ మహిళ ఐఏఎస్ అంటూ నియామక పత్రంతో వచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాలు.. తాను ఐఏఎస్ సాధించాననీ, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు తనను భూ రికార్డులు, కొలతల విభాగం అదనపు కలెక్టర్‌గా విధుల్లో చేర్చుకోవాలని జిల్లా అధికారులను కలిసింది. నకిలీ నియామక పత్రం అని గుర్తించి జిల్లా అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.