నేటి నుంచి '24 స్పీడ్ పోస్ట్' సేవలు
'24 స్పీడ్ పోస్ట్' సేవలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. బుక్ చేసిన మరుసటి రోజే గమ్యస్థానానికి చేరవేసేందుకే '24 స్పీడ్ పోస్ట్' సేవలు అందుబాటులోకి తీసుకువచ్చారు. కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా లాంఛనంగా ప్రారంభించనున్నారు. తొలి దశలో ఢిల్లీ, ముంబై, చెన్నైలో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అలాగే కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్‌లో ప్రారంభం కానున్నాయి.