ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణలో మంత్రి

ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణలో మంత్రి

ELR: చాట్రాయి మండలం తుమ్మగూడెం గ్రామంలో నందమూరి తారకరామారావు విగ్రహాన్ని రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి ఆవిష్కరించారు. తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో టీడీపీని స్థాపించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలక పగ్గాలు చేపట్టి ఢిల్లీ గద్దెను సైతం వణికించిన నాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు. సంక్షేమ పథకాల అమలును ఎలా చేయాలో చేసి చూపి జాతీయ రాజకీయాలను సైతం ప్రభావితం చేశారన్నారు.