'వైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకోండి'
NTR: మైలవరంలోని వివేకానంద హైస్కూలులో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ఆదివారం ప్రారంభించారు. విజయవాడకు చెందిన వైద్యులు రోగులను పరీక్షించారు. ఆరోగ్య నియమాలు పాటిస్తే అకస్మాత్తుగా వచ్చే ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే మంచి ఆహారపు అలవాట్లను పాటించాలని కోరారు.