ప్రైవేట్ హాస్టల్స్‌లో చోరీ.. పోలీసుల నిర్లక్ష్యంపై ఆగ్రహం
WGL: ఖిలా వరంగల్ మండలం బొల్లికుంటలోని మూడు ప్రైవేట్ హాస్టల్స్‌లో సోమవారం తెల్లవారుజామున దొంగతనం జరిగింది. చోరీలో 6 మొబైల్స్, 3 ల్యాప్‌టాప్స్ కోల్పోయినట్లు సమాచారం. యువకుడు హాస్టల్స్‌లోకి చొరబడి దోపిడీ జరిపిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. హాస్టల్స్‌లో తరచుగా చోరీలు జరుగుతున్నప్పటికీ, పోలీసులు పట్టించుకోవడం లేదని విమర్శలు ఎదుర్కొంటున్నారు.