కోయిలకొండలో నేడు ఎమ్మెల్యే పర్యటన

MBNR: కోయిలకొండ మండల కేంద్రంలో శుక్రవారం నూతన గ్రంథాలయ భవనాన్ని ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి గ్రంథాలయ ఛైర్మన్ నరసింహారెడ్డి హాజరవుతారని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జింగరి రవీందర్ తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మండలంలోని కాంగ్రెస్ సీనియర్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఆయన కోరారు.