మృతురాలి కుటుంబానికి ఒక క్వెంట బియ్యం వితరణ
NLG: మునుగోడు మండలం పులిపలుపుల గ్రామానికి చెందిన పందుల ఎల్లమ్మ ఇటీవల మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బొలుగూరి నరసింహ, ఆమె నివాసానికి వెళ్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, ఒక క్వింటా బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు వరంగంటి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.