మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
అల్లూరి జిల్లాలోని ఇవాళ జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు, క్షతగాత్రులకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించినట్లు తెలిపింది. చింతూరు ఏరియా ఆసుపత్రిలో మృతుల కుటుంబాలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పరామర్శించారు.