VIDEO: ఇక్కడ పండగ లేదు.. పబ్బం లేదు.. నిత్యం నరకమే..!
MDCL: చిల్కానగర్ ప్రాంతంలో పండగ లేదు, పబ్బం లేదు, నిత్యం నరకమే అన్నట్లుగా రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ పరిస్థితి దిగజారిపోయింది. గత 20 సంవత్సరాలుగా డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతిని నిత్యం మురుగునీరు పొంగి పొర్లటంతో వాహనదారులు అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విష జ్వరాలతో ఆసుపత్రుల పాలవుతున్నామని డ్రైనేజీ వ్యవస్థను బాగు చేసి, రోడ్డు నిర్మించాలన్నారు.